పవన్ కల్యాణ్ భార్య పాత్రలో శ్రుతి హాసన్?

  • 'పింక్'కి రీమేక్ గా పవన్ 'వకీల్ సాబ్'
  • తాను నటిస్తున్నట్టు ప్రకటించిన శ్రుతి హాసన్ 
  • తాప్సీ పాత్రలో ఎవరన్నది ఇంకా సస్పెన్సే
అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన 'పింక్' హిందీ చిత్రాన్ని తెలుగులో 'వకీల్ సాబ్' పేరిట రీమేక్ చేస్తున్న విషయం మనకు తెలుసు. ఇందులో అమితాబ్ పాత్రలో పవన్ కల్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు. వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరికొంత భాగం షూటింగ్ మిగిలివుంది.

ఇదిలావుంచితే, 'పింక్'లో మరో ముఖ్య పాత్ర అయిన తాప్సీ పాత్రను ఈ చిత్రంలో ఏ హీరోయిన్ పోషిస్తోందన్నది కాస్త సస్పెన్స్ తో సాగుతోంది. ఎందుకంటే, ఇందులో తాను నటిస్తున్నట్టు శ్రుతి హాసన్ ఇటీవల ప్రకటించినప్పటికీ, తన పాత్ర గురించి వెల్లడించేందుకు మాత్రం ఆమె అంగీకరించలేదు.

ఈ క్రమంలో టాలీవుడ్ లో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి, ఆమె తాప్సీ పాత్రలో నటించడం లేదని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కి భార్యగా ఆమె మరో పాత్రను పోషిస్తున్నట్టు చెబుతున్నారు. మరి, తాప్సీ పాత్రను ఎవరు పోషిస్తున్నారన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే వుంది.

Shruti Hassan
Pawan Kalyan
Tapsee
Amitabh Bachchan

More Telugu News